జకీర్‌ నాయక్‌ ఆస్తులు సీజ్‌…!

వివాదా ప్రసంగాలు చేసే ఇస్లాం మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌కు షాక్‌ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌… నిషేధానికి గురైన జకీర్‌ లీడ్‌ చేసే స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌కు చెందిన దాదాపు రూ.18.37 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేశారు ఈడీ అధికారులు. స్వచ్ఛంద సంస్థ పేరిట ఐఆర్‌ఎఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టి అక్రమంగా డబ్బును కూడబెట్టిందని… ఆ డబ్బుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే కుట్రలు చేసిందని ఆరోపణలు వచ్చాయి.

ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ఉగ్రవాద సంస్థల్లో యువకులను చేర్చేందుకు ప్రోత్సహించినట్టు కూడా జకీర్‌ నాయక్‌పై ఆరోపణలున్నాయి. దేశంలో అల్లర్లు చెలరేగేలా ఆయన ప్రసంగాలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టారని కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరోవైపు ఈ నెల 30 విచారణకు రావాల్సిందిగా జకీర్‌ నాయక్‌కు రెండోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఐఏ.