సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సందర్భంగా తమ్మినేని… సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణ భవన్లో వరంగల్‌కు చెందిన సీపీఎం నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడిన కడియం శ్రీహరి… తమ్మినేనిపై మండిపడ్డారు.
తమ్మినేని మాటలను కమ్యూనిస్టులే నమ్మడం లేదన్నారు కడియం శ్రీహరి… టీఆర్ఎస్లో చేరికలు చూసైనా తమ్మినేని పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. 4 వేల కిలోమీటర్లు కాదు కదా… 40 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లాభం లేదన్నారు కడియం. వరంగల్‌లో గుడిసెలకు పట్టాలివ్వడం వెనుక కొన్ని ఇబ్బందులున్నాయన్న డిప్యూటీ సీఎం… అయినా పట్టాలు ఇప్పించటానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు.