ప‌రిశ్రమ‌లో `కాంప్రమైజ్‌`పై కాజ‌ల్ లీక్‌!

క‌థానాయిక‌లు ఒళ్లప్పగిస్తేనే సినిమా ఛాన్సులొస్తాయ‌న్న టాపిక్‌పై అన్ని సినీప‌రిశ్రమ‌ల్లోనూ చ‌ర్చోప‌చ‌ర్చలు సాగుతున్నాయి. కొంద‌రు నాయిక‌లు ఓపెన్‌గానే త‌మ‌కు జ‌రిగిన విష‌యాల్ని పూస‌గుచ్చే ప్రయ‌త్నం చేశారు. తాజాగా ఈ వ‌రుస‌లోకి వ‌చ్చేసిన కాజ‌ల్ `కాంప్రమైజ్‌` గురించి త‌న వెర్షన్ వినిపించింది.

“అవ‌కాశాల కోసం రాజీకి వ‌చ్చి లొంగిపోయే ప‌రిస్థితి నాకెప్పుడూ ఎదురు కాలేదు. కానీ అలాంటి స‌న్నివేశాన్ని ఎదుర్కొన్న సాటి న‌టీమ‌ణులు ఆ విష‌యం నాకు చెప్పిన‌ప్పుడు బాధేసింది. ప్రతిభ ఉండీ ఇలా లొంగిపోవాల్సొచ్చినందుకు వారిగురించి చింతించాను“ అనీ చెప్పింది కాజ‌ల్. ఎక్స్‌పోజింగ్ గురించి చెబుతూ – ప‌రిశ్రమ‌కి వ‌చ్చిన కొత్తలో ఏమీ తెలియ‌దు. తెలియ‌క విప‌రీతంగా ఎక్స్‌పోజ్ చేశాను. అభ్యంత‌ర‌క‌రంగా దుస్తులు ధ‌రించాను. అయితే అన్నీ తెలిసొచ్చాక త‌గ్గించాను. ఎవ‌రికోస‌మో రాజీకొచ్చి ఆ ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేద‌నిపించింది.. అంటూ చెప్పింది. ప్రస్తుతం న‌చ్చిందే చేసే సౌక‌ర్యం, వెసులుబాటు త‌న‌కి ఉంద‌ని చెప్పింది కాజూ. అయితే నాడు ప్రేమించి మోసం చేసిన ఓ క‌థానాయ‌కుడి గురించి మాత్రం కాజ‌ల్ ఏం చెప్పలేదెందుకో?