యూపీ ఫలితాలపై కోర్టుకు మాయావతి!

ఉత్తర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచీ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి… యూపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారంటూ ఆరోపణలు చేసిన మాయావతి… ఎన్నికలను రద్దు చేసి బ్యాలెట్‌ ద్వారా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారామె.

యూపీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే భారతీయ జనతా పార్టీ గెలిచిందని ఆరోపించారు మాయావతి. ఈ అంశంలో కోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందన్నారు. రెండు, మూడు రోజుల్లో కోర్టును ఆశ్రయిస్తామని ఆమె తెలిపారు. కాగా, ఈవీఎంల ట్యాంప‌రింగ్‌లో వాస్తవం లేదని… ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. యూపీ ఎన్నికల్లో 19 సీట్లకే పరిమితమైంది బీఎస్పీ… మరి ఆ పార్టీ అధినేత్రి న్యాయ పోరాటంలో విజయం సాధిస్తారేమో చూడాలి.