సీపీఎం కార్పొరేట్‌ పార్టీగా మారింది…

తెలంగాణలో సీపీఎం కార్పొరేట్‌ పార్టీగా మారిందని ఆరోపించారు మెట్టు శ్రీనివాస్‌… తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తన అనుచరులతో సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మెట్టు శ్రీనివాస్‌ను… డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌ కండువా కప్పి స్వాగతం పలికారు… ఈ సందర్భంగా మాట్లాడిన మెట్టు శ్రీనివాస్‌… కమ్యూనిస్టు సిద్ధాంతం అంటే ప్రాణంగా ఉండేదని… కానీ, ప్రమాణాలు పోయాయని విమర్శించారు.

సీపీఎం కార్పొరేట్‌ పార్టీగా మారిందని ఆరోపించి మెట్టు శ్రీనివాస్‌… ఆ పార్టీలో బాసిజం ఉందంటూ విమర్శించారు. సీపీఎంలో సామజిక న్యాయం లేదన్నారు. సీపీఎం విధానాలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదనే బాధ ఉందన్న మెట్టు… కానీ, బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములము అవుతామన్నారు.