గాంధీలో మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు…

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఓపీ విభాగం నుంచి ఐపి బ్లాక్‌లకు వరకూ అన్నింటినీ పరిశీలించిన మంత్రి… రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెసుకున్నారు. రోగులకు సరిగా సేవలు అందడంలేదంటూ విమర్శలు రావటంతో నిజానిజాలు నేరుగా తెలుసుకున్నారు. తొలుత ఓపీ విభాగంలో అందుతున్న సేవలను పరిశీలించారు. వీల్ చైర్ల అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆరా తీసారు. ఎమర్జన్సీ వార్డులో పర్యటించారు. రోగులకు అందుతున్న చికిత్సలను పరిశీలించారు. శుక్రవారం జరిగిన వీల్ చైర్ ఘటన, అంతేకాకుండా సిబ్బంది నిర్వాకాలపై తరుచూ ఫిర్యాదులు వస్తుండటం తెలిసిందే.

వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. చిన్న చిన్న సంఘటనలను పెద్దవి చేసి చూపి పేదలకు అందే వైద్యంపై అపోహలు సృష్టిచడం సరైంది కాదన్నారు. వీల్ చైర్‌కి డబ్బులు ఇవ్వలేక ఇబ్బంది పడ్డ రాజును కలిసి మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులకు 10 వేల ఆర్థిక సహాయం చేశారు.