ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి విజయం…

తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. మొత్తం 17వేల 652 ఓట్లు పోలవగా… 537 ఓట్లు చెల్లలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50 శాతం ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం… సమీప టీడీపీ ప్రత్యర్థి వాసుదేవనాయుడిపై… 3,553 ఓట్ల తేడాతో గెలుపొందారు.