విమానం కూలి 44 మంది దుర్మరణం…

దక్షిణ సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ సూడాన్ విమానాశ్రయం సమీపంలో… ప్రయాణికులతో వెళ్తున్న సౌత్ సుప్రీం ఏయిర్ లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో సుమారు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సిబ్బందితో పాటు.. ఏయిర్‌ పోర్టు సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. పేలుడు దాటికి ఏయిర్‌ పోర్టు సహా చుట్టుపక్కల ప్రాంతాలలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సౌత్ సుప్రీం ఏయిర్ లైన్స్‌ సంస్థ 2013 సెప్టెంబర్‌లో దక్షిణ సుడాన్-ఉగాండా మధ్య ప్రతీ వారం విమాన సర్వీసులను ప్రారంభించింది.