ప‌వ‌న్‌-మైత్రి సినిమాకి యంగ్ డైరెక్టర్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమాని నిర్మించేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ న‌డుస్తోంది. ఓ యువ‌ద‌ర్శకుడిని స‌ద‌రు సంస్థ హైర్ చేసుకుని ప‌ని మొద‌లెట్టేసిందిట‌. స‌ద‌రు యువ‌ద‌ర్శకుడు ఇప్పటికే క‌థ రెడీ చేసి ప‌వ‌న్‌కి కూడా వినిపించేశాడుట‌. క‌థ న‌చ్చడంతో ప‌వ‌న్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడ‌ని చెబుతున్నారు. కాట‌మ‌రాయుడు త‌ర్వాత హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌లో త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుంది. త‌దుప‌రి మ‌రికొంద‌రు ద‌ర్శకులు క్యూలో ఉన్నారు.

అయితే ఈలోగానే కొత్త యువ‌ద‌ర్శకుడి పేరు తెర‌పైకొచ్చింది. మ‌రి వీళ్లలో ప‌వ‌న్ ఎవ‌రితో ముందుగా సెట్స్‌కెళ‌తాడు? అన్నది ఇప్పుడే తేలే మ్యాట‌ర్ కాదు. ఇప్పటికైతే స‌ద‌రు యువ‌ద‌ర్శకుడు చెప్పిన క‌థ న‌చ్చింద‌ని తెలిసింది. ఇంత‌కీ ఎవ‌రా ద‌ర్శకుడు అంటే `కందిరీగ` ఫేం సంతోష్ శ్రీ‌నివాస్‌. సంతోష్ అంటేనే ఊర‌మాసు. మ‌రి ప‌వ‌న్‌ని ఎలా చూపిస్తాడో చూడాలి.