జీఎస్‌టీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం…

ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర కేబినెట్‌.. జీఎస్‌టీ అమలుకు సంబంధించిన నాలుగు డ్రాఫ్ట్‌ బిల్లులకు ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు సూచించిన మార్పులకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేసిన కేంద్రం.. ఈ బిల్లులను ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం వాటికి రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటి పన్ను వసూళ్లలో విప్లవాత్మకమార్పుగా అభివర్ణిస్తున్న జీఎస్‌టీని జులై 1 నుండి అమలు చేయాలని భావిస్తోంది కేంద్రం.