2018 వ‌ర‌కూ వేచి చూస్తాడుట‌!

విక్టరీ వెంక‌టేష్ చాలాచాలంగా ముఖానికి రంగేసుకున్నదే లేదు. గ‌త కొంత‌కాలంగా క‌థ‌లు వింటూ వెయిటింగులోనే ఉన్నాడు. అందుకే `గురు` సినిమా సెట్స్‌లో ఉండ‌గా వేరొక క‌మిట్‌మెంట్ లేనేలేదు. అయితే అప్పట్లోనే పూరి చెప్పిన క‌థ ఓకే అయిపోయింద‌న్న వార్తలు వ‌చ్చినా, మ‌ధ్యలో ఏం జ‌రిగిందో కుద‌ర‌లేదు. ఈలోగా పూరి బాల‌య్యతో సినిమా మొద‌లెట్టేశాడు. అయితే వెంకీతో సినిమా ఆగిపోయిన‌ట్టేనా? అంటే అదేం లేద‌ని పూరి- వెంకీ సినిమా ప‌ట్టాలెక్కానుంది. అయితే ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉందంతేనంటూ ప్రచారం సాగుతోంది.

ఈ విష‌యంపై వెంకీనే స్వయంగా క్లారిటీ ఇచ్చార‌ని ఫిలింన‌గ‌ర్ జనం చెప్పుకుంటున్నారు. పూరి వినిపించిన దేశ‌భ‌క్తి క‌థ ఓకే అయ్యింది. అయితే బాల‌య్యతో సినిమా పూర్తయ్యాకే ఇది ఉంటుంది. ఒక‌వేళ 2018 వర‌కూ వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఉన్నా వెయిట్ చేస్తాడుట‌. అలాగే స‌మ్మర్‌లో షూటింగులు చేసే ఆలోచ‌న వెంకీకి లేద‌ని చెబుతున్నారు. పూరి మాత్రం బాల‌య్యతో సినిమా పూర్తి చేసి, అటుపై ఏడాది చివ‌రిలోనే ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లే ఛాన్సుంద‌ని చెబుతున్నారు.