మరో 4జీ బడ్జెట్‌ ఫోన్‌…

టెలికం సంస్థల మధ్య 4 జీ యుద్ధం సాగుతోంది… ఆయన టెలికం రంగ కంపెనీలు పోటాపోటీగా కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి… దీంతో 4జీకి సపోర్ట్‌ చేసే ఫోన్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే పలు మొబైల్‌ ఫోన్ల సంస్థలు బడ్జెట్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకురాగా… తాజాగా చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షియోమి మరో కొత్త 4జీ మొబైల్‌ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

రెడ్‌ 4ఏ పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన షియోమి… వినియోగదారులకు ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 5,999కే అందించనుంది. ఇక డార్క్‌ గ్రే , గోల్డ్‌ అండ్‌ రోజ్‌ గోల్డ్‌ కలర్స్‌ ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయి. డ్యుయల్‌ సిమ్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ లాంటి ఆధునిక ఫీచర్లన్నీ పొందుపరచింది షియెమి. మార్చి 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ అమెజాన్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. 5 అంగుళాల డిస్‌ప్లే, 6.0 ఆండ్రాయిడ్‌ మార్షమల్లౌ, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మొమరీతో పాటు 13ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,120 ఎంఏహెచ్‌బ్యాటరీని రెడ్‌ 4ఏలో పొందుపరిచింది షియోమి. ఇది రిలయన్స్‌ జియో సిమ్‌లకు సపోర్ట్‌ చేయనుంది.