హామీ ఇచ్చిన యువరాజ్‌…

వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నాడు… రీఎంట్రీలో ఫామ్‌ను అందుకున్న యువీ… ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపించాలన్న పట్టుదలతో ఉన్నాడు… ఇంగ్లండ్ సిరీస్‌లో సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టేసిన సిక్సర్ల వీరుడు… ఈ సీజన్ ఐపీఎల్‌లో తన మార్క్‌ గ్యారెంటీగా చూపిస్తానని అభిమానులకు హామీ ఇస్తున్నాడు.

చాలా రోజుల తర్వాత గాయం నుంచి కోలుకుని, ఫిట్‌నెస్ సాధించి టీమిండియాలోకి అడుగుపెట్టాడు యువరాజ్… ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సూపర్ డూపర్ సెంచరీ కొట్టాడు… ఆతర్వాత టీ ట్వంటీ సిరీస్‌లోనూ తన మార్క్ చూపించాడు. ఫామ్‌లోకొచ్చిన కాన్ఫిడెన్స్ యువరాజ్‌లో బాగా కన్పిస్తోంది… అందుకే, రానున్న సీజన్‌లో తన మార్క్‌ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టెయిన్ చేస్తానని మాటిచ్చేశాడు యువీ. భారీ షాట్లు కొట్టగల ఫిట్‌నెస్ ఇప్పుడుందన్న వెటరన్ క్రికెటర్… ఐపీఎల్‌లో సన్ రైజర్స్‌ను మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ఐపీఎల్‌ హాట్ ఫేవరేట్స్‌లో ఆరెంజ్ ఆర్మీ ఒకటన్న యువరాజ్.. అంచనాలను తన జట్టు అంచనాలను నిలబెట్టుకుంటుందన్నాడు.