బీజేపీకి యాంటీగా మరో మహా కూటమి…?

కేంద్రంలో బీజేపికి వ్యతిరేకంగా మరో మహా కూటమి తెరపైకి వస్తోందా?..  బీజేపీ అధికారంలో లేని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయా?  ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కొన్ని కూటమిగా జతకడుతున్నాయయా? బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ల కలియక అందుకు సంకేతాలిస్తున్నాయని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ రోజు భువనేశ్వర్‌ పర్యటనకు వచ్చిన మమతా బెనర్జీ.. నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని.. ఎలాంటి రాజకీయాల ప్రస్తావన రాలేదన్నారు మమతా బెనర్జీ. ప్రాంతీయ పార్టీలకు బీజేపీతో ఎటువంటి ముప్పు లేదని  మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.