రైతుల కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం…

అన్నం పెట్టే రైతుకు సమాజంలో గౌరవం పెరగాలన్నారు సీఎం కేసీఆర్. ఉచిత ఎరువుల పంపిణీ పథకం మార్గదర్శకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కేసీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని పండగలా మార్చుతామన్నారు. తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా కావాలని… అందుకోసం ఎన్నికోట్లైనా ఖర్చుచేస్తామన్నారు.

రైతులకు సాగు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని తెలిపారు. రైతులకు భారంగా మారుతున్న పెట్టుబడిని పంచుకుంటామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని తెలిపారు కేసీఆర్. నకిలీ విత్తనాలు అమ్మేనవారిపై పీడీయాక్ట్‌ నమోదు చేస్తామన్న కేసీఆర్.. దానికోసం అవసరమైతే కొత్తచట్టాలు తీసుకొస్తామని చెప్పారు. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమిస్తామని తెలిపారు. త్వరలో వ్యవసాయం శాఖలో ఖాళీలు భర్తీ చేసి… ప్రమోషన్లు కల్పిస్తామని… గ్రామాల్లో రైతు కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు కేసీఆర్.