గైక్వాడ్ విమానం ఎక్కేశాడు…

ఎట్టకేలకు విమానంలో ప్రయాణం చేశారు శివసేన వివాదాస్పద ఎంపీ రవీంద్ర గైక్వాడ్…. బిజినెస్ క్లాస్ సీటు కోసం ఎయిరిండియాకు చెందిన 60 ఏళ్ల ఎయిర్వేస్ ఎగ్జిక్యూటివ్‌ను 25 సార్లు చెప్పుతో కొట్టి వివాదంలో చిక్కుకున్న గైక్వాడ్… తదనంతరం తీవ్ర విమర్శలపాలయ్యారు… ఫలితంగా ఎయిరిండియా సహా నాలుగు విమానయాన సంస్థలు ఆయన విమానాలు ఎక్కకుండా నిషేధం విధించాయి… తన తీరును మొదట్లో సమర్థించుకున్నా ఆ తర్వాత గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

దీంతో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఎయిర్వేస్ కు రాతపూర్వక సూచనలు జారీ చేసిన తర్వాత నిషేధాన్ని ఎత్తివేశాయి… విమానయాన సంస్థల నిషేధం ఎత్తివేసిన తర్వాత కూడా పలుమార్లు రైలు, కారులో ప్రయాణం చేసిన గైక్వాడ్… తొలిసారి విమానం ఎక్కారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఈ రోజు ప్రయాణం చేశారు శివసేన ఎంపీ… మొత్తానికి వివాదం ముగియడంతో మళ్లీ విమానం ఎక్కిన గైక్వాడ్‌కు ఫైనల్‌గా బిజినెస్ క్లాస్ సీటు కేటాయించింది ఎయిరిండియా.