కొనసాగుతోన్న జియో దూకుడు…

టెలికంరంగంలో సంచలనమైన ఆఫర్లుతో కస్టమర్లను ఆకర్షించడమే కాదు… నాణ్యమైన సేవలను కూడా అందిస్తూ దూసుకుపోతోంది రిలయన్స్ జియో… గత నెలలోనూ డౌన్‌లోడ్ స్పీడ్‌లో తొలిస్థానంలో నిలిచిన జియో… ట్రాయ్ తాజాగా విడుద‌ల చేసిన‌ రిపోర్టులోనూ డౌన్‌లోడ్ స్పీడులో ఇత‌ర టెలికం సంస్థల కంటే ముందే కొనసాగుతోంది… టెలికం రంగంలో పేరుపొందిన ఎయిర్‌టెల్, ఐడియా కంటే జియో దాదాపు రెండు రెట్ల స్పీడు అందిస్తోందని తన తాజా నివేదికలో పేర్కొంది ట్రాయ్.

ఐడియా సెల్యులార్ స్పీడ్‌ 8.33 ఎంబీపీఎస్ తో రెండో స్థానంలో నిల‌వ‌గా భారతీ ఎయిర్‌టెల్ 7.66 ఎంబీపీఎస్, వొడాఫోన్ 5.66, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2.64, టాటా డొకొమో 2.52, బీఎస్ఎన్ఎల్ 2.26 వేగంతో వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయని పేర్కొంది. రిలయన్స్ జియో స్పీడు ప్రకారం వినియోగదారుడు సుమారు 5 నిమిషాల్లో ఒక బాలీవుడ్ మూవీని 16 ఎంబీపీఎస్ స్పీడుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.