ఫిర్యాదులను స్వయంగా పరిశీలిస్తాం…

ఏపీలో ప్రజావాణి కాల్ సెంటర్‌ను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. సంక్షేమం పథకాల్లో ఇబ్బందులు,.. ప్రజల సమస్యలు తెలిపేందుకు గుంటుపల్లి వద్ద ‘పరిష్కార వేదిక’ పేరుతో.. 750 మంది సిబ్బందితో మెగా కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.

ఈ కార్యమ్రంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… కాల్ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులను నిత్యం స్వయంగా పరిశీలిస్తామని తెలిపారు. కాల్ సెంటర్ ఫిర్యాదులపై రాష్ట్ర ప్రణాళిక ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు సీఎం. ప్రజలకు పైసా ఖర్చులేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాల్ సెంటర్ చక్కని వేదిక అని.. ప్రజల సలహాలు, సూచనలతో సుపరిపాలన అందిస్తమన్నారు సీఎం. ఇప్పడు టెక్నాలజీలో మార్పు వచ్చిందని.. ప్రతీ పైసా పేదలకు అందేలా ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం. ఈ కార్యక్రమంలో పది మంది మంత్రులు పాల్గొన్నారు.