తెలంగాణలో రైతు రాజు అవుతాడు: కేసీఆర్‌

సమాజంలో రైతులంటే చులకన భావం ఉందని, కానీ తెలంగాణలో మాత్రం రైతు రాజు అవుతాడని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇప్పటి నుండి ప్రతి రైతుకు ఎకరానికి నాలుగు వేలు పెట్టుబడి ఇస్తామని, ఇలా ఒక పంటకు కాదు రెండు పంటలకు ఇస్తామని తెలిపారు. ఈ పెట్టుబడి తెలంగాణలోని ప్రతి రైతుకు అందుతుంది, ఈ పథకంలోకి దళారులను రానివ్వొద్దని పేర్కొన్నారు.

మంచి ధర రావాలంటే ఎవరు ఏ పంట పండించాలనదే ముందే తెలియాలి, అలాగే ధనిక రైతులుండే రాష్ట్రంగా తెలంగాణ తయారుకావాలని ఆకాంక్షించారు. ఇక 40లక్షల మందికి వేయి రూపాయల పెన్షన్‌ ఇస్తున్నామని, పేదలకు సన్నబియ్యం అన్నం పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వమేనని ప్రకటించారు. ఇంకా కేసీఆర్‌ ఏం మాట్లాడారో తెలుసుకోవాలనుకుంటే పై వీడియో క్లిక్‌ చేయండి.