ఇంజనీరింగ్ కాలేజీలపై గవర్నర్ ఆగ్రహం….

ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. జేఎన్టీయూ 6వ వార్షికోత్సవంలో పాల్గొన్న గవర్నర్… సరస్వతీ నిలయాలను.. లక్ష్మీ నిలయాలుగా మార్చొందని వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు.

ఇంజనీరింగ్ కాలేజీల్లో క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమన్న గవర్నర్… సత్తా ఉన్న ఇంజనీర్లను తయారు చేయలేకపోతే కాలేజీలు మూసివేయాలని సూచించారు. 10, 15 మంది విద్యార్థులతో ఒక ఫ్యాకల్టీతో ఇంజనీరింగ్ కాలేజీలు నడపడం సరైన పద్దతేనా… ఆ విధంగా ఇచ్చిన పీహెచ్‌డీలు సమాజానికి ఉపయోగపడుతున్నాయా అంటూ గవర్నర్ ప్రశ్నించారు. అయితే, ఇంజనీరింగ్ కాలేజీల ప్రమాణాలను గాడిలో పెట్టాల్సింది ప్రభుత్వమేనని సూచించారు గవర్నర్.

https://www.youtube.com/watch?v=M3fS5-R4Qhg

Comments

comments