జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలు పూర్తి…

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో… ఇటు జగన్, అటు సీబీఐ తరుఫు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది. అనంతరం కేసును 28కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

అయితే, అక్రమాస్తుల కేసులో సుమారు ఏడాదిన్నర కాలం జైళ్లో ఉన్న జగన్.. బెయిల్‌పై బయట ఉన్నారు. కాగా, సాక్ష్యులను ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ… జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, ఈ కేసులో జగన్‌తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విజయ సాయి రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు కోర్టు ఎదుట హాజరయ్యారు.