గులాబీ సారధుడిగా మరోసారి కేసీఆర్‌…

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ జరుగుతున్న వేళ ఆ పార్టీ అధ్యక్షుడిగా మరోమారు కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు ప్రకటించిన తరువాత కేసీఆర్ తరఫున క్యాబినెట్ మంత్రులు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారని ఆయన అన్నారు. దీంతో అతడి ఎన్నిక ఏకగ్రీవమైందని వెల్లడించారు.

మరోవైపు కోంపల్లి వేదికగా జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సమావేశానికి దాదాపు 15వేల మంది హాజరవుతారని అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా వారందరికీ తెలంగాణ వంటకాలతో విందు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సభలో పలు తీర్మానాలపై చర్చలు జరగనున్నాయి.