సర్టిఫికేట్స్‌తో యువతి వివాహం…

పెళ్లి అంటే వధవు, వరుడు ఉండాలి. అలా కాకుండా ఈ మధ్య కాలంలో యువతిని యువతులు కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలున్నాయి. మరికొందరు నపుంసకులను కూడా వివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ హూస్టన్‌లో ఓ యువతి వీటన్నింటికీ కాస్త భిన్నంగా వివాహ ఆహ్వానాలు పంపింది. అందేంటనుకుంటున్నారా… అవును ఆ యువతి తన గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికేట్లను వచ్చే నేల 13న వివాహం చేసుకోనున్నట్లు.. బంధువులకు, స్నేహితులకు ఆహ్వానాలు పంపింది.

టెక్సాస్‌ యూనివర్సిటీకి చెందిన ఏంజీ హుమాయ్ అనే మెడికల్ విద్యార్థిని… ఇటీవ‌లే తన డాక్టర్ పట్టాను తీసుకుంది. మొత్తం 9 సంవత్సరాలు కష్టపడి మెడిసిన్ పూర్తి చేసిన ఏంజీ. ఇప్పుడు ఆ సర్టిఫికేట్‌నే పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. గ్రాడ్యుయేషన్‌ అనేది జీవితంలో ఒకసారే వస్తుందని.. అందుకే ఆ స‌ర్టిఫికెట్‌నే పెళ్లి చేసుకోనున్నట్లు తన వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. సర్టిఫికెట్‌తో పెళ్లి అంటే… నామమాత్రంగా చేయడంలేదట మరి. సంప్రదాయ పెళ్లి వేడుకలానే… విందు, సంగీత్‌, బట్టలతో పాటు.. సంప్రదాయబద్దంగా కేక్ కట్టింగ్ కూడా ఉంటుందని తెలిపింది. ఈ వివాహానికి సుమారు 70 నుంచి 80 మంది అతిథులు హాజరవుతారని అంచానా వేస్తున్నారు ఏంజీ. అయితే, తాన చదువు గురించి అందరికీ గొప్పగా చాటిచెప్పాల‌నే తాను ఈ ‘గ్రాడ్యూ వెడ్డింగ్‌’ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది.