అమ్మ చివరి రోజుల వివరాలు భయటపెడతా: శశి మేనల్లుడు

తమిళనాడులో అన్నాడీఎంకేలో ఇంకా సంక్షోభం కొనసాగుతుండగా శశికళ మేనల్లుడు జయానంద్‌ దివాకరన్‌ మరో బాంబు పేల్చారు. అమ్మ చివరి రోజులకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడతానని ప్రకటించారు. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జయలలితకు చికిత్స అందించిగా, ఆ సమయంలో అమ్మకు, శశికళకు జరిగిన సంభాషణ వివరాలు, ఫొటోలు వెల్లడిచేస్తానని హెచ్చరించారు.

జయలలితను శశికళ కుటుంబం పొట్టన పెట్టుకుందని పన్నీర్‌ సెల్వం వర్గం ఆరోపించడంపై ఆవేదన వ్యక్తం చేసిన దినకరన్‌, నిజం నిప్పులాంటని, అది ఏనాటికైనా బయటకు వస్తుందని అన్నారు. “ఆసుపత్రిలో ఉండగా జయలలిత ఫొటోలు శశికళ ఎందుకు బయటపెట్టలేదని అడుగుతున్నారు. పచ్చ రంగు గౌన్‌లో ఆస్పత్రిలో దీనంగా ఉన్న అమ్మను ఆమెను ప్రత్యర్థులకు చూపించడం ఇష్టంలేకే శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారు. చనిపోయే వరకు ‘అమ్మ’ సింహంలా బతికింది. ఈ ఇమేజ్‌ కాపాడేందుకు ప్రయత్నించాం. కానీ పన్నీర్‌ సెల్వం అమ్మ శవపేటిక నమూనాతో ఓట్లు అడుక్కున్నారు. నిజం చాలా బలమైంది. అమ్మ, చిన్నమ్మ మాట్లాడుకున్న వీడియోలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. పీహెచ్‌ పాండియన్‌, మనోజ్‌ కె పాండియన్‌లను అప్పుడు మనం ఏం చేయాలని” దివాకరన్‌ ప్రశ్నించారు.