టీఆర్‌ఎస్‌ ఎక్కువ రోజులు ఉండదన్నారు: కేసీఆర్‌

హైదరాబాద్‌లోని కోంపల్లిలో టీఆర్‌ఎస్‌ 16వ ప్లీనరీ సమావేశం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆ తరువాత స్టేజ్‌పైకి ఎక్కి మొదట అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.., తనపై నమ్మకంతో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలని తెలిపారు.

ఆంధ్రపాలనలో తెలంగాణ కుంచించుకుపోతున్న సమయంలో 2001లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరిందని, తమ పార్టీ మనగడపై మొదట్లో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని కొందరైతే టీఆర్‌ఎస్‌ ఎక్కువ రోజులు కొనసాగదని అన్నారని, అయితే అందరి సమిష్టి కృషితో టీఆర్‌ఎస్‌ పార్టీని ఈ స్థాయి వచ్చిందని తెలిపారు. ఇక ఒకప్పుడు వందలమందితో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ఇప్పుడు 75లక్షలకు చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.