ఎన్ని అన్నా ఆమె నా ఫేవరెట్‌…

టాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌పై బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కరణ్‌కు ఆశ్రిత పక్షపాతం ఎక్కువ అని, స్టార్‌ వారసులనే ఆయన ప్రోత్సహిస్తుంటారని ఆయన షోలోనే కంగనా రనౌత్‌ విమర్శలు చేసింది. అయితే ఈ విమర్శలకు కరణ్‌ కూడా అప్పుడు ఘాటుగా బదులిచ్చాడు. నిత్యం బాధితురాలు కార్డును చూపించి సానుభూతి పొందాలనుకోవడం సరికాదని హితవు పలికాడు.

ఇదంతా పక్కనపెడితే ఆ వివాదం ఎలా ఉన్నా వ్యక్తిగతంగా కంగన అంటే తనకు ఇష్టమని, ఆమెకు తాను అభిమానినని తాజాగా చెప్పుకొచ్చాడు కరణ్‌. అంతేకాదు తాను గతంలో ఇచ్చిన పార్టీకి ఆమెను పిలువలేదని, కానీ ఇకపై ఇచ్చే పార్టీకి రావల్సిందిగా ఆమెకు తప్పకుండా ఫోన్‌ చేస్తానని చెప్పుకొచ్చాడు. కానీ కంగనపై తాను చేసిన విమర్శలకు మాత్రం క్షమాపణ చెప్పబోనని ఆయన అన్నాడు.