టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు…

ఏపీలో జిల్లా టీడీపీ అధ్యక్షులను ప్రకటించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. విజయవాడ అర్బన్‌ను పెండింగ్‌లో ఉంచిన బాబు… విజయనగరం, విశాఖ రూరల్, తూర్పుగోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా-గౌతు శిరీష, విజయనగరం జిల్లా- మహంతి చిన్నరాయుడు, విశాఖ అర్బన్‌- వాసుపల్లి గణేష్‌కుమార్, విశాఖ రూరల్‌- పంచకర్ల రమేష్‌బాబును అధ్యక్షులుగా ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లా- నామన రాంబాబు, పశ్చిమగోదావరిజిల్లా తోట సీతారామలక్ష్మి, కృష్ణా- బచ్చు అర్జునుడు, గుంటూరు- జీవీఎస్‌ ఆంజనేయులకు అధ్యక్ష పదవులు దక్కాయి. ప్రకాశం జిల్లాకు దామచర్ల జనార్థన్‌ను, నెల్లూరు జిల్లాకు బీద రవిచంద్రను నియమించారు. చిత్తూరు జిల్లా- పులివర్తి వెంకటమణిప్రసాద్‌, కడప- శ్రీనివాసులురెడ్డి, కర్నూలు- సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అనంతపురం- బీకే పార్థసారథిలను జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ప్రకటించారు.