వీడిన మైనర్ బాలికల మిస్సింగ్ మిస్టరీ…

విజయవాడలో సంచలనంగా మారిన ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్ మిస్టరీ వీడింది. గురునానక్‌ నగర్‌లోని హాస్టల్‌ నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు అమ్మాయిల ఆచూకీ దొరికింది. విజయవాడలో తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని మచిలీపట్నం సమీపంలో గుర్తించారు పోలీసులు. రోషిణి, మరియమ్మలు బందర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు… వారిని విజయవాడ తీసుకువచ్చారు.

ఈనెల 15న వారిద్దరూ అనాథాశ్రమం నుంచి వెళ్లిపోయారు. దీంతో… వీరి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అనాథాశ్రమంలో సరైన వసతులు లేవని గుర్తించిన అధికారులు దాన్ని మూసివేయించారు. అందులోని బాలికలను మరో ఆశ్రమానికి తరలించారు.