హైకోర్టు విభజన కేంద్రం పరిధి నుంచి కోర్టుకు వెళ్లింది…

హైకోర్టు విభజన కేంద్రం పరిధి నుంచి కోర్టుకు వెళ్లిందన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి పీపీ చౌదరి… భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పీపీ చౌదరి… హైకోర్టు విభజనపై మూడు పిటిషన్లు కోర్టులో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జి కలిసి నివేదిక ఇస్తే హైకోర్టు విభజనకు మేం సిద్ధమని తెలిపారు.

ఏపీలో హైకోర్టు, సచివాలయం, రాజ్ భవన్ నిర్మాణానికి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు పీపీ చౌదరి. తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు జడ్జిలను నియమిస్తామని అన్నారు. జడ్జి పోస్టుల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ ఉందన్న పీపీ చౌదరి… ఈ విషయాన్ని కొలీజియంకు రిఫర్ చేశామన్నారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రామచందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్ రావు పాల్గొన్నారు.