ఆది ‘నెక్స్ట్ ఏంటి’…

సాధారణంగా ఒక పాట హిట్ అయిందంటే అందులో క్యాచీ పదాలను సినిమా టైటిల్స్ గా పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఈ పద్దతి టాలీవుడ్ లో ఎప్పటినుండో ఉంది. ఈ ఏడాది హిట్ అయిన పాటల్లో నాని నటించిన ‘నేను లోకల్’ సినిమాలో నెక్స్ట్ ఏంటి ఒకటి. ఇప్పుడు ఈ పదాన్ని తన సినిమాకు టైటిల్ గా పెట్టేసుకున్నాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. కమర్షియల్ హీరోగా నిరూపించుకోవాలని ఆది చేస్తోన్న ప్రయత్నాలు ఈ మధ్య బాగా బెడిసి కొడుతున్నాయి. దీంతో తన పంధాను మార్చుకొని హారర్, కామెడీ సినిమాకు సై అన్నాడు.

ఈ చిత్రాన్ని టీవీ యాక్టర్‌ ప్రభాకర్ డైరెక్ట్ చేయబోతున్నారు. వీ4 బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ‘నెక్స్ట్ ఏంటి’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారని సమాచారం. ఓ తమిళ హారర్ కామెడీ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యాంకర్ రష్మీ అలానే సీనియర్ నటుడు సాయి కుమార్ కూడా మెరవనున్నారు. ఆది ఈ సినిమాతో పాటు మరో ముగ్గురు యంగ్ హీరోలతో కలిసి ‘శమంతకమణి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాను నటిస్తోన్న ఈ రెండు సినిమాలు కూడా హీరోగా తన స్థాయిని పెంచుతాయని నమ్ముతున్నాడు.