పదకొండు మందితో ఆడాల్సింది, ఏడుగురిమే ఆడుతున్నాం…

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ బీఎస్ ధ‌నోవా. పదకొండు మందితో ఆడాల్సిన మ్యాచ్‌ను కేవలం ఏడుగురు ఆటగాళ్లం మాత్రమే ఉండి, పదకొండు మంది సభ్యులున్న జట్టుతో తలపడుతున్నట్టు ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండియ‌న్ ఎయిర్‌ ఫోర్స్‌లో యుద్ధ విమానాలు, యుద్ధ పైల‌ట్ల కొర‌త ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఇక పాక్ నుంచి ఉగ్రదాడులు ఇలాగే కొనసాగితే, గగనతలం నుంచి విరుచుకుపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని ఆయన తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వసన్నద్ధంగా ఉన్నప్పటికీ, కేవలం గ్రౌండ్ లెవల్ ఫోర్సెస్‌కు ఇంటెలిజెన్స్ సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితవుతోందని ఆయన చెప్పారు. ఇక మావోయిస్టులపై గగనతలం నుంచి దాడులు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ సొంత దేశంలో, సొంత ప్రజలపై దాడులు చేసేందుకు సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు.