పోలీసు ట్రైనింగ్‌ క్యాంపులో ఫుడ్‌ పాయిజన్…

ఆదిలాబాద్‌లోని పోలీసు ట్రైనింగ్‌ క్యాంపులో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దీంతో 37మంది ట్రైనీ కానిస్టేబుళ్లు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవ్వగా, చికిత్స నిమిత్తం వారిందరిని రిమ్స్‌కు తరలించారు. అయితే గతంలోనూ ఇదే ట్రైనింగ్‌ క్యాంపులో ఫుడ్‌ పాయిజన్‌ అయింది. దీనిపై ఫిర్యాదు చేసిన కానిస్టేబుళ్లకు అధికారుల నుండి ఒత్తిళ్లు పెరుగుతుండటంతో వారు ఏం చేయలేకపోతున్నారు.