గిల్‌క్రిస్ట్‌ రికార్డును బ్రేక్‌ చేసిన పాండ్యా…

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికీ, అందులో తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్‌ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ నెలకొల్పిన రికార్డును హార్దిక్ బద్దలు కొట్టాడు.

ఐసీసీ టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్‌ల్లో వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు పాండ్యా. 32 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి ఐసీసీ ఫైనల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే 1999 వరల్డ్ కప్‌లో గిల్ క్రిస్ట్ ఈ రికార్డును 33 బంతుల్లో సాధించగా, దాదాపు 18 ఏళ్ల తరువాత 32 బంతులకే హాఫ్‌ సెంచరీ చేసేశాడు పాండ్యా. దీంతో అరుదైన రికార్డు పాండ్యా సొంతమైంది.