జీవితంలో క‌లిసి న‌టించ‌రట‌!

ర‌ణ‌బీర్‌- క‌త్రిన ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ప్రేమించుకున్నారు.. స‌హ‌జీవ‌నం చేశారు.. అటుపై గొడ‌వ‌లొచ్చి విడిపోయారు. అయితే అలాంటి జంట అనూహ్యంగా అనురాగ్ బ‌సు `జ‌గ్గా జాసూస్‌` కోసం క‌లిసి న‌టించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్రమోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో క‌త్రినకు ఓ ఠ‌ఫ్ క్వ‌శ్చ‌న్ ఎదురైంది. మీ జంట మ‌ళ్లీ క‌లిసి న‌టిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు స‌సేమిరా అనేసింది క్యాట్‌. ర‌ణ‌బీర్ ట్రైయింగ్ అండ్ టెస్టింగ్ ప‌ర్స‌న్‌.

దీన్ని బ‌ట్టి మ‌రోసారి ర‌ణ‌బీర్‌- క‌త్రిన మ‌ధ్య ఆన్ లొకేష‌న్ గొడవ జరిగినట్లు కత్రినా మాటలను బట్టి అర్థమవుతోంది. తాను ఇక జీవితంలో రణబీర్ తో కలసి నటించనని కత్రినా తెగేసి చెప్పేసింది. ఒకానొక సంద‌ర్భంలో జ‌గ్గా జాసూస్ సెట్స్‌లో క్యాట్‌తో కలసి ఇక నటించనని రణబీర్ అన్నాడుట‌. ఆ మాట అన్న తరువాత అతడితో నటించడం చాలా కష్టంగా అనిపించింది. ఇక జీవితంలో అతడితో నటించకూడదని నిర్ణయించుకున్నాన‌ని క‌త్రిన ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఈ మాజీల వ్య‌వ‌హారంపై ఆస‌క్తిక‌ర డిష్క‌స‌న్ మొద‌లైంది.