ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి బాబు, కేసీఆర్‌, జగన్‌ మద్దతు…

కనీసం ఎన్డీఏ పక్షాలు కూడా ఊహించని విధంగా బీహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. దీంతో ఇప్పుడు అతడి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ ఫోన్‌ చేసి మద్దతును అడిగారు.

దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్‌, బాబు రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఇరు ముఖ్యమంత్రులు రామ్‌ నాథ్‌ కోవింద్‌కు తమ మద్దతును ప్రకటించారు. ఇక ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ఎన్డీఏ అభ్యర్థికి తన మద్దతును తెలిపారు. మరోవైపు సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లతో కూడా మోదీ ఫోన్‌లో మాట్లాడి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.