బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌…

రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండగా బీజేపీ నుండి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. బీజేపీ నుండి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఖరారు చేశారు. ఈ రోజు మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరగగా, అందులో రాష్ట్రపతి ఎన్నిక గురించి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చివరగా రామ్‌నాథ్‌కు ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం బీహారు గవర్నర్‌గా చేస్తున్న రామ్‌నాథ్‌ కోవింద్‌కు 12 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా చేసిన అనుభవం ఉంది.

కాన్పూర్‌ సమీపంలోని డేరాపూర్‌లో జన్మించిన కోవింద్‌, బీజేపీ దళిత్‌మోర్చా అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేసిన కోవింద్‌, రాజనాథ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు. ఇక 71ఏళ్ల వయసు గల కోవింద్‌, రాష్ట్రపతి అభ్యర్థిగా ఈ నెల 23న తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.