ఫ్లాపిచ్చినా పూరిని వ‌ద‌ల‌ని `రోగ్‌`

యువ క‌థానాయ‌కుడు ఇషాన్‌ను టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేస్తూ పూరి జ‌గ‌న్నాథ్ `రోగ్` చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో.. భారీ పారితోషికం తీసుకుమ‌ని పూరి ఈ సినిమా చేశాడని టాక్ వినిపించింది. అయితే సినిమా రిలీజ్ త‌ర్వాత ఫ‌లితాలు తేడా కొట్టాయ్. ఇషాన్ హీరోగా పాస్ మార్కులు వేయించుకున్నా.. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్శియ‌ల్ గా స‌క్సెస్ కాలేదు. అయితే ఈ సినిమా టైమ్ లోనే ఇషాన్ తో పూరికి మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డింది. పూరి త‌న‌ని కొడుకులా ట్రీట్ చేసేవార‌ని ఆడియో వేదిక‌పైనే ఇషాన్ చెప్ప‌డం విశేషం. నిర్మాత‌ల‌కు సైతం పూరితో అంతే సాన్నిహిత్యం ఉంది.

ఎలాగైనా ఇషాన్ ను స్టార్ హీరోని చేసే బాధ్య‌త‌ను ఆ స‌మ‌యంలోనే పూరి నెత్తిన వేసుకున్నాడు. అందుకే మ‌రోసారి ఇషాన్ ను డైరెక్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని స‌మాచారం. ఈసారి క‌థ విష‌యంలో డిఫ‌రెంట్ వేలో వెళ్లాల‌ని పూరి నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఈ విష‌యం పూరి కనెక్స్ట్ టీమ్ ద్వారా లీకైంది. పూరి ప్ర‌స్తుతం బాల‌య్య‌ 101వ సినిమా `పైసా వ‌సూల్‌` చేస్తున్నారు. త‌ర్వాత‌ వేరే హీరోల‌తో క‌మిట్ మెంట్స్ ఏవీ లేవు. ఈ నేప‌థ్యంలో ఇషాన్‌తోనే త‌దుపరి సినిమా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.