సుబ్రతారాయ్‌కు 15రోజుల పెరోల్‌ గడువు పెంపు…

సహారా అధినేత సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు మరో 15 రోజులు అవకాశమిచ్చింది. ఆయనకు ముందు ఇచ్చిన జూన్ 19 వరకు పెరోల్ గడువును జూలై 5 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే అంతకముందు ఇచ్చిన గడువులో జూన్ 15 వరకు రూ.1500 కోట్లను చెల్లించాలని లేకపోతే, ఏకంగా తిహార్ జైలుకే పంపుతామని గట్టిగా హెచ్చరించింది సుప్రీం.

కానీ వాటిలో సహారా రూ.790 కోట్లను మాత్రమే చెల్లించగా, మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు పెరోల్ పొడిగింపును కోరింది. లండన్‌లోని గ్రోస్వెనోర్ హౌస్ స్టేక్‌ను అమ్మామని, దీని ద్వారా మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి చెల్లించాల్సిన నగదును సేకరిస్తున్నామని సహారా సుప్రీంకోర్టుకు చెప్పింది. మిగతా రూ.709.82 కోట్ల మొత్తాన్ని కూడా సహారా-సెబీకి 10 రోజుల్లో రీఫండ్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో జైలుకు పంపాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించింది.