త్రిష ఎందుకంత ఎమోష‌న్ అయ్యింది?

ప్ర‌తి ఒక్క‌రికి మ‌న‌సు అనేది ఒక‌టుంటుంది. ఆ మ‌న‌సు విరిగిపోయిన‌ప్పుడు దాని నుంచే కాస్తంత తాత్విక‌త పుట్టుకొస్తుంది. క్యూట్ త్రిష లైఫ్‌లో అలాంటి ఎమోష‌న‌ల్ సంద‌ర్భాలెన్నో. అయితే అన్నిటినీ జ‌యించింది. అనుకున్న‌ది సాధించుకుని.. స్వేచ్ఛ‌గా స్వేచ్ఛా విహంగంలా ఎగిరిపోతోంది. కెరీర్‌లో, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో త్రిష‌కు సంకెళ్లు వేసేవాళ్లు లేరు. తాను అస‌లు బానిస‌త్వ త‌త్వం ఉన్న అమ్మాయి కాదు.

ఈరోజు ట్విట్ట‌ర్‌లో త్రిష‌లోని డీప‌ర్ ఇన్‌సైడ్ బ‌య‌టికొచ్చింది. ఎమోష‌న్ క‌నిపించింది. ఔన్స్ ఆఫ్ ఎమోష‌న్‌.. . అలాంటి పిలుపునే `ప్రేమ` అని పిలుస్తారు.. అంటూ కాస్తంత ఉద్వేగంతోనే సంభాషించింది. మ‌నుషుల మ‌ధ్య ఉద్వేగాల్ని ట‌చ్ చేసింది తన మాట‌ల్లో.. లైఫ్ ఈజ్ గుడ్‌.. పూర్తి స్వేచ్ఛ‌తో జీవిస్తున్నా. ఎంతో అందంగా.. అని త్రిష ట్వీట్ చేసింది. అయితే త్రిష అంత‌గా ఎమోట్ అవ్వ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది? అని ఆరాతీస్తే.. అంత‌కంటే ముందే క‌ర‌ణ్ జోహార్ అనే ఫ్యాన్ త‌న‌కి ఓ ట్వీట్ చేశాడు. దాని సారాంశం ఇలా ఉంది. “మార్కెట్లోకి ఓ కొత్త వ‌స్తువు వ‌చ్చింది. దానిపేరే – లైఫ్‌. స్టాక్ ఉన్నంత‌వ‌ర‌కే దొరుకుతుంది. వెళ్లి కొనుక్కో“ అదీ సారాంశం. అందుకే త్రిష ఇంత‌గా ఎమోష‌న్ అయ్యిందా? త‌న గ‌తానుభ‌వాల దృష్ట్యా..?