‘నా పేరు సూర్య’ మ్యూజిక్ కోసం ముంబై వెళ్లిన బన్నీ…

‘డీజే’ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ ‘నా పేరు సూర్య’… నా ఇల్లు ఇండియా… వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో బన్నీ సరసన ఇప్పటికే అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా కన్ఫర్మ్ కాగా… విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించనున్నారు. బన్నీ సినిమా అంటే అదిరిపోయే స్టెప్పులకు కొదవేలేదు… మరి బన్నీ స్టెప్పులకు అదేరేంజ్‌లో మ్యూజిక్ కూడా ఉండాల్సిందే… అందుకే తన తాజా మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబైలోని మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ శేఖర్‌ స్టూడియోకు వెళ్లిపోయారు బన్నీ.

ముంబైలో బన్నీ, మ్యూజిక్ డైరక్టర్ విశాల్ శేఖర్‌ కలిసి దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తుండగా… ఇటీవలే చిత్రీకరణ ప్రారంభోత్సవం జరిగింది… ఆగస్టు మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ మూవీలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కీలక పాత్ర పోషించనున్నారు.