వెంకయ్యనాయుడు ఎంపికపై చంద్రబాబు హర్షం

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా వెంకయ్య అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారంటూ బీజేపీ చీఫ్ అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే… ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన ప్రకటించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడును ఫోన్‌ల్లో అభినందించారు సీఎం చంద్రబాబు. ఉపరాష్ట్రపతి పదవికి అనుభవజ్ఞుడైన వెంకయ్యనాయుడు అన్నివిదాలా అర్హుడంటూ ఆయన పేర్కొన్నారు.