కేటీఆర్‌కు సంస్కారం‌లేదు…

మంత్రి కేటీఆర్‌కు సంస్కారం‌లేదంటూ మండిపడ్డారు సీఎల్పీ నేత జానారెడ్డి. టీఆర్ఎస్ నేతలు కుసంస్కారంతో వ్యవహరిస్తున్నారని… మేం వాళ్లలా దిగజారి మాట్లాడలేమన్నారు జానా… మంత్రి కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని… అహాంకారంతో చెలరేగుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు జానారెడ్డి.

వరంగల్‌లో జరిగిన కార్పొరేటర్ హత్య కేసులో డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిని ఇరికించారని ఆరోపించారు జానారెడ్డి… ఆ హత్యతో రాజేందర్ రెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదని… నిందితులు తామే హత్య చేశామని చెప్పాక కూడా రాజేందర్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణం అన్నారు. రాజకీయంగా అణిచివేతకు కుట్ర చేయడం ప్రభుత్వానికి పోలీసుకి తలవంపు వస్తుందన్న జానారెడ్డి… 1978లో నన్నూ ఇలాగే ఓ కేసులో ఇరికించారని గుర్తు చేశారు. అప్పుడు మా విజ్టప్తి మేరకు సిఐడి విచారణలో నేను నిర్దోషి అని తేలినా కేసు పెట్టారన్నారు జానారెడ్డి. కక్ష్య సాధింపు కోసం కేసులు పెడితే… అసలు దోషులు తప్పించుకుంటారన్నారు జానారెడ్డి.