ఏదోరోజు టీమిండియా కోచ్‌ అవుతా…

టీమిండియా కోచ్‌గా చేయడం చాలా గొప్ప విషయమని అభివర్ణించారు ఆసీస్‌ మాజీ బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ. టీమిండియా కొత్త కోచ్‌గా ఎన్నికైన రవిశాస్త్రికి అభినందనలు చెప్పిన గిలెస్పీ, భవిష్యత్తులో టీమిండియా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకుంటానని అన్నారు.

అంతేకాకుండా భారత జట్టుకు కోచ్‌గా చేయాలని ఈ సంవత్సరం అనుకున్నానని అనుకున్నానని, కానీ సరైన నిర్ణయం తీసుకోలేక విఫలమయ్యానని, దీనిపై కుటుంబ సభ్యులతో కూడా చర్చించానని అన్నారు. అయితే భవిష్యత్తులో టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసే అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటానని, ఏదోరోజు భారత క్రికెట్ కోచ్ అవుతాననే నమ్మకం కూడా ఉందని గిలెస్పీ ఆశాభావం వ్యక్తం చేశాడు.