నంబర్‌ వన్‌కు కాస్త దూరంలో..

వన్డే క్రికెట్ ర్యాంకింగ్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకునేందుకు కాస్త దూరంలో ఉంది భారత మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌. ఇటీవల ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో 774 రేటింగ్ పాయింట్లతో మిథాలీ రాజ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా, మొదటి స్థానం చేరేందుకు ఐదు పాయింట్ల దూరంలో ఉంది. ఇదిలా ఉంటే మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మిథాలీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

అంతకుముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించి, తద్వారా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని నంబర్ వన్‌కు దగ్గరలో ఉంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (779) టాప్‌ వన్‌లో కొనసాగుతోంది.