కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఫోన్…

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ… ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నతర్వాత… కేసీఆర్ కు ఫోన్ చేశారు ప్రధాని… ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడుకు మద్దతుఇవ్వాల్సిందిగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు మోదీ.

మరోవైపు వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్… ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. కాగా, రేపటితో ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుండడంతో రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్న వెంకయ్యనాయుడు.