తప్పుడు కేసులు పెడితే మేం అధికారంలోకి వచ్చాక చర్యలు…

తప్పుడు కేసులు పెడితే మేం అధికారంలోకి వచ్చాక పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ. రాజకీయ ఒత్తిడితోనే వరంగల్ కాంగ్రెస్ నేత రాజేందర్ రెడ్డిపై కేసు పెట్టారని ఆరోపించిన షబ్బీర్… టీఆర్ఎస్ నేతలు కావాలనే కేసు పెట్టించారని మండిపడ్డారు. సీఎం వస్తుంటారు పోతుంటారు‌… కానీ, పోలీస్ వ్యవస్థ శాశ్వతమని గుర్తుంచుకోండి అంటూ వ్యాఖ్యానించారు షబ్బీర్ అలీ.

‌కామారెడ్డిలో ఓ ఎస్సైని ఎమ్మెల్యే కొడితే చర్యలు తీసుకోకపోగా… ఎస్సైని వీఆర్ లోకి పంపారంటూ ఆరోపించారు షబ్బీర్ అలీ… చెంప చెళ్లు మనాలా… గూబ గుయ్ మనాలన్న సీఎం కేసీఆర్ మాటలను మేం ఉల్టా చేసి చూపిస్తామన్నారాయన. కాంగ్రెస్ తిడుతే ఆకాశంపై ఉమ్మివేసినట్టే నన్న షబ్బీర్ అలీ… మంత్రి కేటీఆర్‌ను రాళ్లతో కొట్టే రోజు త్వరలోనే ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.