భవిష్యత్ నాయకత్వం మీ నుండే రావాలి-కేటీఆర్

భవిష్యత్ నాయకత్వం మీ నుండే రావాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్… విద్యార్థి విభాగం సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రాజకీయాలకు దూరంగా ఉంటాం అనే భావన కరెక్ట్ కాదని విద్యార్థులకు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్… పంచ భూతాలను పరమాన్నంలా భుజించినది కాంగ్రెస్ కాదా? అంటూ ఆయన ప్రశ్నించారు.

తెలంగాణాలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు చెప్పాలని విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు కేటీఆర్… కాంగ్రెస్ ద్రోహాన్ని ఈ తరానికి చెప్పాలన్నారు. చంపినవాళ్లే వచ్చి సంతాపం చెప్పినట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం మేం పోరాడామూ అని అంటున్న కాంగ్రెస్ నేతలు.. కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా?… మీరు ఎవరి మీద పోరాటం చేశారు? అంటూ ప్రశ్నించారు. ఏదిఏమైనా తెలంగాణ ప్రజలకే మనం జవాబుదారి అని… భవిష్యత్ నాయకత్వం విద్యార్థుల నుంచే రావాలని పిలుపునిచ్చారు కేటీఆర్.