బాలీవుడ్ హీరో కోసం టాలీవుడ్ డైరెక్టర్!

తెలుగులో లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్ వంటి చిత్రాలను తెరకెక్కించి మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు శ్రీవాస్. ప్రస్తుతం ఈ డైరెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలీవుడ్ లో సినిమా చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ డైరెక్టర్. దానికోసం ఇప్పటినుండి హీరో టైగర్ ష్రాఫ్ తో సంప్రదింపులు జరుపుతున్నాడని సమాచారం.

శ్రీవాస్ దగ్గరున్న ఓ కథ టైగర్ ష్రాఫ్ కు బాగా సెట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ ను హీరోగా ఎన్నుకోవడాన్ని బట్టి బాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్ళి సక్సెస్ అయిన దర్శకుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. మరి ఈ నేపధ్యంలో శ్రీవాస్ నైనా.. విజయం వరిస్తుందేమో చూడాలి!