ఏకగ్రీవంగా వెంకయ్యను ఎంపిక చేశాం…

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును ఖరారు చేశామంటూ అధికారికంగా ప్రటించారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా… బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమవేశంతో తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వెంకయ్యను ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని తెలిపారు బీజేపీ చీఫ్.

వెంకయ్యనాయుడు కొన్ని దశాబ్దాలుగా పార్టీకి సేవలందించారని ప్రశంసించిన అమిత్‌షా ఆయన కింది స్థాయి నుంచి ఎదిగిన తీరును చెప్పుకొచ్చారు. పార్టీలో ఆయన నిర్వహించిన వివిధ బాధ్యతలను గుర్తుచేశారు. పార్టీలో అత్యున్నత నేతల్లో వెంకయ్యనాయుడు ఒకరంటూ ప్రశంసించారు అమిత్‌షా. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వెంకయ్యనాయుడు అన్ని విధాలా అర్హుడని ఆయన వ్యాఖ్యానించారు.