వెంకయ్యనాయుడే సరైన అభ్యర్థి-మోదీ

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడుకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ… వెంక‌య్యకు ఉన్న పార్లమెంటరీ అనుభ‌వం క్రియాశీల‌కం కానుందని, ప్రజా జీవితంలో ఎంతో అనుభ‌వం గ‌డించిన నేత వెంకయ్యనాయుడంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ… వెంక‌య్యనాయుడు ఓ రైతు బిడ్డ… సుదీర్ఘ పార్లమెంటు అనుభ‌వంతో రాజ్యస‌భ ఛైర్మన్‌గా కీల‌క భూమిక పోషిస్తారని పేర్కొన్నారు మోదీ.

చాలా సంవత్సరాలుగా వెంక‌య్యనాయుడు త‌న‌కు తెలుసని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ… కీల‌క‌మైన రాజ్యస‌భ‌లో వెంక‌య్య సేవ‌లు ఎంతో అవసరం అన్నారు. వెంకయ్యనాయుడు నిరంత‌ర శ్రమ త‌న‌ను ఆకట్టుకుందని ట్వీట్ చేసిన మోదీ… అందుకే త‌మ‌ ఉపరాష్ట్రప‌తి అభ్యర్థిగా ఆయనే స‌రైన వ్యక్తి అని భావించామ‌ని పేర్కొన్నారు. ఆ పదవికి వెంక‌య్య వ‌న్నె తెస్తారన్నారు ప్రధాని మోదీ. మరోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడుకు అభినందనలు తెలుపుతున్నారు రాజకీయప్రముఖులు, బీజేపీ శ్రేణులు.